హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు

Published Fri, Dec 22 2023 1:36 PM

Crime Rate Increase In Hyderabad - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు  పాల్గొన్నారు. 

నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు..

  • హైదరాబాద్‌లో 24,821 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
  •  గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 
  • 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు 
  • గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు
  • గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు 
  • వివిధ కేసుల్లో జరిగిన  నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ 
  • హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909
  • రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు 
  • ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 
  • 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు
  • ఈ ఏడాది  83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ 
  • గత ఏడాది తో పోలిస్తే  ఈఏడాది 11 %  పెరిగిన సైబర్ నేరాలు
  • ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు
  • మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం 
  • ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం
  • ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ 
  • సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్
  • పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు

ట్రాఫిక్ కేసులు ఇలా..

డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

డ్రగ్స్ అనే మాట వినపడొద్దు..
ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు.  

ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

Advertisement
Advertisement