ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Hyderabad Punja Gutta | Sakshi
Sakshi News home page

ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

Dec 22 2023 8:34 AM | Updated on Dec 22 2023 11:43 AM

Fire Accident In Hyderabad Punja Gutta - Sakshi

పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి స్పష్టత లేదు.

 

ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరోవైపు ఘటన నేపథ్యంలో పంజాగుట్ట ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌ అయ్యింది. అదే భవనంలో ఆరో అంతస్థులో చికుకున్న ఓ కుటుంబాన్ని శ్రావణ్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రక్షించారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఇదీ చదవండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి

Advertisement
 
Advertisement
Advertisement