మూసాపేట మెట్రో స్టేషన్‌ గోడలకు పగుళ్లు

Cracks on Moosapet Metro Station Wall, video goes viral on Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికుల్నిమరోసారి భయపెడుతున్నాయి. తాజాగా మూసాపేటలోని మెట్రో స్టేషన్‌ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. (హైదరాబాద్‌ మెట్రో.. ఇవి తెలుసుకోండి)

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top