రేవంత్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్ ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్: విజయదశమిని పురస్కరించుకొని బుధవారం జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసానికి పలువురు కాంగ్రెస్ ప్రముఖులు వచ్చారు. రేవంత్ ఇచ్చిన తేనేటి విందుకు ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్, కేవీపీ రాంచందర్‌రావు, మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.