సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో చలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. అధికార పార్టీ నేతల ర్యాలీ నేపథ్యంలో లోక్‌భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోక్‌భవన్ వద్దకు మంత్రులు చేరుకోవడంతో వారిని అక్కడే అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, ఎన్నికల కమిషన్, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న


