సాక్షి, హైదరాబాద్ /సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బరాజ్‌కు చేరుకొని పునరుద్ధరణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు.
అంబట్‌పల్లిలోని అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తుర్‌పల్లికి చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగసభ వేదికగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు నస్తుర్‌పల్లి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
అబద్ధాల పునాదులపైనే రేవంత్ సీఎం అయ్యారు


