అంగన్‌వాడీలో టర్పంటాయిల్‌ తాగి చిన్నారి మృతి 

Child Passed Away After Drinking Turpentine In Anganwadi In Kamareddy District - Sakshi

మద్నూర్‌(జుక్కల్‌): అంగన్‌వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్‌ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మద్నూర్‌ మండలం రాచూర్‌కి చెందిన సూర్యకాంత్‌ కుమార్తె అదితి(5) శనివారం మినీ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం ఆ బాలిక నోటి నుంచి నురగ రావడం గమనించిన అంగన్‌వాడీ కార్యకర్త నగరబాయి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది.

దీంతో కుటుంబసభ్యులు చిన్నారిని మహారాష్ట్ర దెగ్లూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, అదితి టర్పంటాయిల్‌ను అంగన్‌వాడీ కేం ద్రంలో తాగిందా.. లేక ఆ సమీపంలోని అంగన్‌ వాడీ కార్యకర్త ఇంట్లో తాగిందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాప టర్పం టాయిల్‌ తాగి మృతి చెందిందని, దీనికి కార్యకర్త నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీడీపీవో సునంద వివరణ కోరగా, ఆదివారం ఉదయం రాచూర్‌కు వెళ్లి విచారణ చేపడతామని, ఆ తర్వాతే పాప మృతికి గల కారణాలు వివరిస్తామని బదులిచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top