10న చెన్నైకి కవిత  | BRS MLC Kalvakuntla Kavitha Likely To Visit Chennai On Feb 10th | Sakshi
Sakshi News home page

10న చెన్నైకి కవిత 

Feb 8 2023 3:15 AM | Updated on Feb 8 2023 8:34 AM

BRS MLC Kalvakuntla Kavitha Likely To Visit Chennai On Feb 10th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు ?’’అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్య క్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పాల్గొననున్నారు.

బీఆర్‌ఎస్‌ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత పంచుకోను న్నారు. రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ప్రసంగించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ వల్ల సామాజికంగా ఒనగూరే ప్రయోజనాలతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థ పై చూపించే సానుకూలతల గురించి వివరించనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement