BJP MLA Raja Singh Wrote Letter To PM Modi, Amit Shah Over Death Threat - Sakshi
Sakshi News home page

నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖలు

Published Fri, May 12 2023 7:43 AM

BJP MLA Raja Singh Letter To PM Modi Amit Shah Over Death Threat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న పరిస్థితులతో తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు గురువారం లేఖలు రాశారు.

హైదరాబాద్‌ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, తనపై, తన కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తనకు పలు బెదిరింపు కాల్స్‌ రావడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భారీ భద్రత కలి్పంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్‌ భయపడుతున్నారు: బండి సంజయ్‌

Advertisement
Advertisement