కేటీఆర్‌ కాన్వాయ్‌లో అపశ్రుతి | Bike Hits Woman Constable In KTR Convoy At Karimnagar BRS Cadre Meeting, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ కాన్వాయ్‌లో అపశ్రుతి

Published Sun, Mar 23 2025 3:56 PM | Last Updated on Sun, Mar 23 2025 5:19 PM

Bike Hits Woman Constable In Ktr Convoy Karimnagar

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాన్వాయ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది.

సాక్షి కరీంనగర్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాన్వాయ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్‌ను బైక్‌ ఢీకొట్టింది. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మహిళా కానిస్టేబుల్‌ను కేటీఆర్‌ పరామర్శించారు. ఆమెకు అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

కాగా, ఆదివారం.. కేటీఆర్‌ కరీంనగర్‌లో జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరయ్యారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్‌ మెంబర్లు, డివిజన్‌ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement