
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 టీకా ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్లాంట్, కార్యాలయాలకు సీఐఎస్‌ఎఫ్(కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ రిజిస్టర్డ్ ఆఫీసుతోపాటు ప్లాంట్‌కు 64 మంది సీఐఎస్‌ఎఫ్ సాయుధ సభ్యుల బృందం భద్రత కల్పించనుందని అధికారులు తెలిపారు.