ఓఆర్‌ఆర్‌.. నేరాలకు అడ్డా | Antisocial activities On Outer Ring Road | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌.. నేరాలకు అడ్డా

Jan 28 2025 1:37 PM | Updated on Jan 28 2025 1:39 PM

Antisocial activities On Outer Ring Road

 సర్వీస్ రోడ్లు, నిర్మానుష్య ప్రదేశాలే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు

కానరానీ సీసీ కెమెరాలు, రాత్రిళ్లు అంధకారం 

ఇదే అదునుగా మలుచుకుంటున్నవైనం

మేడ్చల్‌రూరల్‌: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు( Outer Ring Road) నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ ఇరువైపులా దాని పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. దీనికితోడూ ఓఆర్‌ఆర్‌  సర్వీస్ రోడ్లులో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రుల్లో చీకటిగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అసాంఘిక  కార్యకలాపాలు సాగిస్తున్నారు.  

కానరానీ సీసీ కెమెరాలు, హైమాస్ట్‌ లైట్లు.. 
⇒ ఓఆర్‌ఆర్‌ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్‌రోడ్డులో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో  సర్వీస్‌రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ అండర్‌ పాస్‌ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో సర్వీస్‌రోడ్డు ఉండడంతో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. 

గతంలో మేడ్చల్‌ పరిధిలోని కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్‌రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారడంతో కొందరు వ్యభిచారులు పట్టపగలే చెట్లపొదల చాటున తమ దందా సాగించారు. ఇదే విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్‌ చేయడంతో ఆగినా.. ప్రస్తుతం సర్వీస్‌ రోడ్డులో పోలీసుల లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు.

సీసీ కెమెరాలు లేక నానాతంటాలు..
మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సరీ్వస్‌ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈనెల 24న ఓఆర్‌ఆర్‌  సర్వీస్ రోడ్లు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచి్చంది. చివరకు హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫొటోలతో పాటు జిల్లాల్లో లుక్‌అవుట్‌ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement