service roads
-
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు సమీప ప్రాంతాల ప్రజలకు ఇది శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును సర్వీసు రోడ్లతో కలిపి నిర్మించారు. ఇవి వాహనదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ పొడవునా, ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌లో సర్వీసు రోడ్డు ప్రస్తావన లేదు. దీనిని సాధారణ జాతీయ రహదారిలా కాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్లు అవసరం లేదని తొలుత నిర్ణయించారు. కానీ సర్వీసు రోడ్లు లేకుంటే స్థానిక జనావాసాల్లోని వాహనదారులకు ఇది ఉపయోగంగా ఉండదని, కచి్చతంగా సర్వీసు రోడ్లు కావాలని స్థానికులు ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో చెప్పారు. కానీ ఎన్హెచ్ఏఐ తోసిపుచ్చింది. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్హెచ్ఏఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు రోడ్డు డిజైన్‌ను మార్చి సర్వీసు రోడ్డు ఆప్షన్‌ను చేర్చింది. పీఎం గతి శక్తిలోని ఎన్పీజీ ఆదేశంతో.. కీలక ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు వాటిని పీఎం గతి శక్తి పర్యవేక్షణలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. పీఎం గతి శక్తిలో భాగంగా ఉన్న నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) ఇటీవల భేటీ అయినప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై చర్చించింది. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా ఉంటుందని, కొత్త ఎస్ఈజడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లు వస్తాయని, అప్పుడు స్థానిక జనావాసాల్లోని వాహనదారుల కోసం ఈ రోడ్డుకు అనుబంధంగా సర్వీసు రోడ్లు అవసరమవుతాయని అభిప్రాయపడింది. ఈ రోడ్డు నిర్మించే అలైన్‌మెంటుతో పాటే స్థానిక రోడ్లపై ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ట్రాఫిక్ సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. కాగా 2021–22లో నిర్వహించిన ట్రాఫిక్ స్టడీతో పోలిస్తే కొత్త అధ్యయనంలో వాహనాల సంఖ్య అంచనాను మించి పెరిగితే, వచ్చే ఐదారేళ్లలో రెట్టింపవుతుందని అంచనా వేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రధాన క్యారేజ్‌వే మీదుగా కాకుండా, దిగువగా వెళ్లి ఇతర రోడ్లతో అనుసంధానమయ్యే వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుందని, సర్వీసు రోడ్లు లేకుంటే ఆ వాహనాలకు ఈ రోడ్డు ఉపయోగపడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ట్రాఫిక్ స్టడీలో వాహనాల సంఖ్య బాగా పెరిగినట్టు తేలితే కచ్చితంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్హెచ్ఏఐకి సిఫారసు చేసింది. అయితే వాహనాల సంఖ్య బాగా పెరిగిందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన నేపథ్యంలో, సర్వీసు రోడ్లు నిర్మాణానికి వీలుగా ట్రిపుల్ ఆర్ డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. తొలుత 5.5 మీటర్లు..ఒకే వరుస ట్రిపుల్ ఆర్కు రెండు వరుసల సర్వీసు రోడ్డును డిజైన్ చేస్తున్నారు. తొలుత 5.5 మీటర్లతో కూడిన ఒకే వరుస సర్వీసు రోడ్డును నిర్మించాలని, వాహనాల రద్దీ పెరిగిన తర్వాత దాన్ని 7.5 మీటర్లకు, రెండు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే సర్వీసు రోడ్లు ఫ్లైఓవర్లు ఉన్న చోట ఉండవు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉన్న చోట.. వాటి దిగువగా నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసే చానళ్ల ద్వారా యూ టర్న్ తరహాలో ఉండి మళ్లీ ప్రధాన క్యారేజ్ వేను ఆనుకుని దిగువగా ముందుకు కొనసాగుతాయి. ఈ మేరకు ప్రధాన క్యారేజ్ వే, దిగువ ప్రాంతాలకు కేటాయించిన అలైన్మెంటులో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు. ట్రాఫిక్ స్టడీ వివరాలను కేంద్రానికి సమర్పించిన తర్వాత, ఢిల్లీ స్థాయిలో అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుని స్థానిక ఎన్హెచ్ఏఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. -
ఓఆర్ఆర్.. నేరాలకు అడ్డా
మేడ్చల్‌రూరల్: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road) నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ ఇరువైపులా దాని పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. దీనికితోడూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లులో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రుల్లో చీకటిగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కానరానీ సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు.. ⇒ ఓఆర్ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్‌రోడ్డులో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్‌రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సర్వీస్‌రోడ్డు ఉండడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ⇒ గతంలో మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్‌రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారడంతో కొందరు వ్యభిచారులు పట్టపగలే చెట్లపొదల చాటున తమ దందా సాగించారు. ఇదే విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగినా.. ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసుల లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు.సీసీ కెమెరాలు లేక నానాతంటాలు..మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సరీ్వస్ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈనెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచి్చంది. చివరకు హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫొటోలతో పాటు జిల్లాల్లో లుక్అవుట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు. -
ఔటర్‌పై ‘వన్‌వే’ కష్టాలు
రాయదుర్గం: ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డులో వన్‌వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్లో రెండు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. సోమవారం నుంచి ఈ వన్‌వేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. దీంతో నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్ నుంచి రోటరీ–1 నుంచి నార్సింగి వరకు వెళ్లే వాహనాలు మైహోమ్ అవతార్ వరకు వన్‌వే, నార్సింగి నుంచి వచ్చే వాహనాలు మైహోమ్ అవతార్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని నానక్‌రాంగూడ జంక్షన్‌కు వచ్చి అండర్‌పాస్ మీదుగా ఖాజాగూడవైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర వాహనదారులు కనీసం గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొంటున్నారు. కొత్త నిబ«ంధనలతో నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ సర్వీసు రోడ్డులో రెండు వైపులా టూ వే ఉండడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రాకపోకలు నిర్వహించేవి. కానీ రెండు రోజులలో కొత్త నిబంధనలు పెట్టి వన్‌వే ఏర్పాటు చేయడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నార్సింగి, మెహిదీపట్నం, అప్పా జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. వారితోపాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు నిర్వహించేలా, ఎక్కడా వాహనాలు ఆగకుండా చూడాలని కోరుతున్నారు. -
‘సర్వీస్’ స్టాప్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లోని ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విభాగాధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపమవుతోంది. ఓఆర్ఆర్ లైన్‌లోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉన్నా కాలయాపన చేస్తుండడంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అదనంగా రెండు మూడు కిలోమీటర్లు తిరిగివెళ్లాల్సి వస్తోంది. 2012లో ఓఆర్ఆర్తో పాటే సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటికీ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదులనాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ ప్రాంతాల్లో ఓఆర్ఆర్ను తాకుతూ వెళ్తున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో అవస్థలు పడుతున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే సూత్రపాయంగా అనుమతిచ్చినా అధికారులు ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. దీనిపై గతంలో అప్పటి కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించి బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఎక్కడెక్కడ? ఎలా? మేడ్చల్: కీసర నుంచి పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వరకు సర్వీసు రోడ్డులో ప్రయాణించి, అక్కడి నుంచి యంనంపేట్ గ్రామంలోకి చేరుకొని ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటి మళ్లీ సర్వీసు రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్ కారణంగా ఇక్కడ సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా దాదాపు 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్ మీదుగా సర్వీసు రోడ్డుకు చేరుకోవడానికి 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. శంషాబాద్: ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇరువైపులా సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వాహనదారులకు దారి తెలియక అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు మార్గంలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం 2 కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. ఘట్కేసర్: ఘట్కేసర్ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్లి స్టేషన్ సమీపంలో నుంచి రింగు రోడ్డు వెళ్తోంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు రోడ్డు నిర్మించారు. దీంతో సర్వీసు రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్‌ప్లాజా నుంచి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలోమీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్దనున్న సర్వీసు రోడ్డు నుంచి వెళ్లాల్సి వస్తోంది. పటాన్చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా ఉంది. రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ దూరం తిరగాల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. -
ఓఆర్ఆర్..‘సర్వీసు’బేజార్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల పనులు చేపట్టడంలో అధికారులు గత కొన్నేళ్లుగా ఉదాసీనత చూపుతున్నారు. ఓఆర్ఆర్ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టేశారు. అక్కడ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా కావాలనే కాలయాపన చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. ఫలితంగా రెం డు, మూడు కిలోమీటర్లు అదనంగా తిరుగుతూ వెళ్లాల్సి వస్తోందని ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు గ గ్గోలు పెడుతున్నారు. రైల్వే ట్రాక్ ఉన్న ప్రాంతంలో వం తెనలు నిర్మిస్తే..టోల్ కలెక్షన్ తగ్గిపోతుందనే ఇలా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2012 లోనే ఓఆర్ఆర్తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావల్సి ఉన్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై వా హనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈదులనాగులపల్లి, శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ సమీపంలోని ఓఆర్ఆర్ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న అసంపూర్తి సర్వీసు రోడ్లు ముప్పుతిప్పలు పెడుతున్నా యి. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రా రంభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం పూర్వ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేసినా అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. ఘట్కేసర్ గౌడవెళ్లి వద్ద... ఘట్కేసర్ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్–నాందేడ్ రైల్ మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్ళి స్టేషన్ సమీపంలో నుండి ఓఆర్ఆర్ రోడ్డు వెళుతుంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘట్కేసర్ వైపు నుండి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్చెరు వైపు నుండి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో సర్వీస్ రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్ ప్లాజా నుండి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు నుండి వెళ్లాల్సి వస్తుంది. పటాన్చెరు వైపు నుండి వాహనదారుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. సుతారిగూడ టోల్ ప్లాజానుండి అసంపూర్తి గా ఉన్న సర్వీసు రోడ్డు రింగురోడ్డుకు ఇరువైపులా కనీసం పనులు మొదలు పెట్టలేదు. ఈదులనాగులపల్లిలో... రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా మిగిలింది. మధ్యలో సర్వీసు రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసు రోడ్డు లేకపోవడంతో తాత్కాలికంగా మట్టితో రాంపో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్ దూరం తిరిగి రావల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మేడ్చల్‌లో... కీసర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వరకు సర్వీస్ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్ గ్రామంలోకి చేరుకొని ఘట్కేసర్ బైపాస్ రోడ్డు కూడలి దాటాలి. రైల్వే ట్రాక్ కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా సుమారు మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించవలసి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్ వైపు నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్ గ్రామం మీదుగా సర్వీస్ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తే వాహనదారులు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. శంషాబాద్‌లో... ఔటర్ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్–తిమ్మాపూర్ స్టేషన్ల రైల్వే ట్రాక్ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో వాహనదారులు తికమకకు గురై అసంపూర్తిగా ఉన్న సర్వీసు మార్గంలో వెళ్లి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తుంది. -
సర్వీస్ రోడ్డు వచ్చే వరకూ పోరాటం
రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు(మినిబైపాస్): రహదారులకు ఓవర్ బ్రిడ్జిలు, పూర్తి స్థాయి సర్వీస్ రోడ్లు నిర్మించాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రూరల్ పరి«ధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవేలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలో మీటర్ల పోడుగునా వాహనాలు ఆగిపోయాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం, లోకసత్తా, టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం నేషనల్ హైవే అ«ధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాలైన బుజబుజనెల్లూరు, చిల్డ్రన్ పార్కు ప్రాంతాలు ప్రమాదాలకు నియంగా మారాయన్నారు. ఇప్పటికి అధికారికంగా 52 మంది మృతి చెందారన్నారు. సర్వీసు రోడ్డును విస్మరించడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సర్వీస్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. 2003లో ఏర్పాటు చేసిన రహదారికి ఇప్పటి వరకు ఇరుపక్కల ప్రాంతాలను కలిపేందుకు అవసరమైన బాక్సు టైపు బ్రిడ్జి, ప్లయ్ ఓవర్, సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరుగకుండా దృష్టి ని సారించాలని, ఇవి నిర్మించే వరకు తాత్కాలికంగా అవసరమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు, ఇండికేటర్లు, నగరం నుంచి జాతీయ రహదారిని కలిపే బుజబుజనెల్లూరు, గొలగమూడి క్రాస్ రోడ్డు, చింతా రెడ్డి పాళెం, ఎన్టీఆర్ నగర్ క్రాస్ రోడ్లలో ప్రామాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ రాష్త్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, కార్పోరేటర్ పిగిలం ప్రవీణ, లోక్ సత్తా నాయకురాలు లత, న్యాయవాది బద్దెపూడి రవీంద్ర, డాక్టర్ వేణుగోపాల్, వైఎస్సారసీపీ నేతలు ఖాదర్ బాషా, శ్రీహరి యాదవ్, జమునమ్మ, టీడీపీ నేతలు పిగిలం నరేష్ , దూడల చిన్ని, సీపీఎం నేత బషీర్, లోక్ సత్తా నాయకురాలు లత పాల్గొన్నారు.