Lucky Draw For Telangana Liquor Shop Tenders - Sakshi
Sakshi News home page

తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా

Aug 21 2023 11:35 AM | Updated on Aug 21 2023 12:08 PM

All Set For Lucky Draw For Liquor Shop Tenders  - Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ అంబర్‌పేట్‌ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగుతోంది. లక్కీ డ్రా జరుగుతున్న సెంటర్లో మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు అధికారులు.

గత కొన్ని రోజులుగా జరిగిన మద్యం షాపు దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రా ఆధారంగా వారికీ షాపులు కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం దుకాణాలకు కొనసాగుతున్న లక్కీ డ్రా అంబర్‌పేట్‌ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. ఇక ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీగా వాహనాల ప్రవాహం ఉంటుందని ముందే అనుమానించిన ట్రాఫిక్ శాఖ ఆంక్షలు విధించారు.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లక్కీ డ్రా సమయంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీగా అభండారట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోకి దరఖాస్తుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు.  

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement