ప్రజల భద్రతలో ఆదిలాబాద్‌ జిల్లా టాప్‌

Adilabad Tops Personal Safety Index In Telangana - Sakshi

జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు

రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజల భద్రత విషయంలో ఆదిలాబాద్‌ జిల్లాకు జాతీయ స్థాయిలో 5వ స్థానం దక్కింది. అలాగే రాష్ట్రంలో సురక్షిత జిల్లాగా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సర్వేలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్‌క్రైమ్, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక నేరాలు, వ్యక్తిగత భద్రత, తదితర అంశాలతో కూడిన 89 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు.

కాగా, నాగలాండ్‌లోని మొఖోక్‌ జిల్లా 89.89 శాతం మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా 85 మార్కులతో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పరంగా తెలంగాణకు 42 మార్కులు లభించాయి. రాష్ట్రస్థాయిలో కరీంనగర్‌ జిల్లా 81 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. భద్రత విషయంలో ఆదిలాబాద్‌ జిల్లాకు మంచి ర్యాంకు దక్కడంపై జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top