తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు | 2092 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు

Aug 6 2020 9:01 AM | Updated on Aug 6 2020 1:58 PM

2092 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 2092 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1289 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 52,103గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసీలో 535, రంగారెడ్డి జిల్లాలో 169, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 128, మేడ్చల్‌ జిల్లాలో 126, కరీంనగర్‌ జిల్లాలో 123, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,43,489 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement