DMK Councillor, Husband And Their Daughter Died By Suicide At Home In Rasipuram - Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదం: కుటుంబంతో సహా డీఎంకే కౌన్సిలర్‌ బలవన్మరణం

Jul 13 2023 8:52 AM | Updated on Jul 13 2023 10:30 AM

DMK councillor husband and daughter die by suicide - Sakshi

రాశిపురం డీఎంకే మహిళా కౌన్సిలర్‌ దేవి ప్రియ (31) తన భర్త, కుమార్తెతో కలిసి బలన్మరణానికి పాల్పడింది.

తమిళనాడు: రాశిపురం డీఎంకే మహిళా కౌన్సిలర్‌ దేవి ప్రియ (31) తన భర్త, కుమార్తెతో కలిసి బలన్మరణానికి పాల్పడింది. బుధవారం వారి ఇంట్లో వారు ఉరికి వేలాడుతుండటాన్ని గుర్తించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు.. నామక్కల్‌ జిల్లారాశిపురం బొమ్మితేరు ప్రాంతానికి చెందిన అరుణ్‌లాల్‌(42) రెండు దశాబ్దాలుగా స్థానికంగా నగల దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య దేవి ప్రియ(31), కుమార్తె మోనిక శ్రీ(18)తో పాటు మరో కుమార్తె ఉన్నారు. దేవిప్రియ రాశిపురం మునిసిపాలిటీ 13వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌గా ఉన్నారు.

మోనిశ్రీ  ప్లస్‌–2 ఉత్తీర్ణత సాధించి ఉంది. పెద్దకుమార్తె బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.  ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోక పోవడంతో ఇరుగు పొరుగు వారు కిటికి గుండా లోనికి చూశారు. అరుణ్‌ లాల్, దేవిప్రియ ఉరికి వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగల కొట్టి లోనికి వెళ్లారు.

దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. చిన్న కుమార్తె మోనిక శ్రీకి విషం తాగి మరణించినట్లు తేలింది. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం హఠాత్తుగా బలన్మరణానికి పాల్పడటం అనుమానాలకు దారి తీశాయి. వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చిందా..? లేదా మరెదేని కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతి విషయాన్ని బెంగళూరులోని పెద్దకుమార్తెకు పోలీసులు తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement