విక్రమ్‌ ప్రభు 26వ చిత్రం షురూ | - | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ ప్రభు 26వ చిత్రం షురూ

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

పొటో: 20: అరుళ్‌నిధికి సూచనలు ఇస్తున్న అజయ్‌ జ్ఞానముత్తు

డీమాంటీ కాలనీ–3కి డేట్‌ ఫిక్స్‌

తమిళసినిమా: నటుడు అరుళ్‌నిధి కథానాయకుడిగా నటించిన చిత్రం డీమాంటీ కాలనీ. అజయ్‌ జ్ఞానముత్తు కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం గత 11 ఏళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత దానికి సీక్వెల్‌గా రూపొందిన డీమాంటీ–2, చిత్రం అంతకుమించిన విజయాన్ని సాధించింది. ఇప్పుడు డీమాంటీ–3 చిత్రం తెరకెక్కనుంది. ఈ మూడు చిత్రాలకు హీరోహీరోయిన్గు అరుళ్‌నిధి, ప్రియాభవానీశంకర్‌ రే కావడం విశేషం. బాలీవుడ్లోనే సీక్వెల్‌ చిత్రాలు రూపొంది సక్సెస్‌ అవుతుంటాయి. మనకు అలాంటివి అరుదే.కాగా డీమాంటీ కాలనీ–3 చిత్రం మంచి సక్సెస్‌ అవుతుందనే నమ్మకాన్ని యూనిట్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. డీమాంటీ కాలనీ 1, 2 చిత్రాల కంటే మూడవ సీక్వెల్‌ ఇంకా బ్రహ్మాండంగా రూపొందినట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుదన్‌ సుందరం పేర్కొన్నారు. ఈ చిత్రం ఫైనల్‌ కాపీ చూసిన తరువాత ఇందులో భాగంగా అయినందుకు గర్వంగా అనిపించిందన్నారు. ఇందులో ప్రేక్షకులకు పలు ఆశ్చర్యకరమైన అంశం చోటుచేసుకుంటాయని అన్నారు. దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు, అరుళ్‌నిధి ఇతర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో రూపొందించారని పేర్కొన్నారు. చిత్రాన్ని సెప్టెంబరు 11వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని సుదన్‌ సుందరానికి చెందిన ఫ్యాషన్‌ స్టూడియోస్‌, దంగల్‌ టీవీ, ఆర్డీఎక్స్‌ మీడియా, జ్ఞానముత్తు పట్టరై సంస్థలు కలిసి నిర్మించాయి. దీనికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, శివకుమార్‌ విజయన్‌ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో ఫైవ్‌ స్టార్‌ సెంథిల్‌ విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు విక్రమ్‌ ప్రభు.ఈయన ఇటీవల టాణాక్కారన్‌, సిరై వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విక్రమ్‌ ప్రభు తన 26వ చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ పతాకంపై రాహుల్‌ నిర్మించనున్నారు. పలు చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించారు. అదే సమయంలో పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా విక్రమ్‌ ప్రభు హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రం గురించి ఈ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం బంగారు మార్కెట్‌ నేపథ్యంలో సాగే కమర్షియల్‌ అంశాల కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కథలో పలు ఆక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. నటుడు విక్రమ్‌ ప్రభు కెరీర్‌లో ఇది ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిత్ర తొలి షెడ్యూల్‌ ను చైన్నెలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందులో నటించే కథానాయకి,ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. కాగా ఈ చిత్రంతో పాటు రోమియో పిక్చర్స్‌ సంస్థ ప్రస్తుతం రవి మోహన్‌ హీరోగా ఒక చిత్రం, నటుడు ఆకాశ్‌ మురళి హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement