నాగుపాము కథ.. అంటేనే హిట్‌ | - | Sakshi
Sakshi News home page

నాగుపాము కథ.. అంటేనే హిట్‌

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

తమిళసినిమా: పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన తాజా చిత్రం నాగబంధం. నిక్‌ స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థల అధినేతలు కిషోర్‌ అన్నపరెడ్డి నికిషా నాగిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అభిషేక్‌ నామ దర్శకత్వం వహించారు. నటుడు విరాట్‌ కర్ణ, నటి నబా నటేశ్‌, ఐశ్వర్య మీనన్‌, జగపతిబాబు ,జయప్రకాష్‌, మురళీ శర్మ , పిఎస్‌ అవినాష్‌ ,జాన్‌ కొక్కెన్‌ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం జూలై 3వ తేదీన తమిళం, తెలుగు ,మలయాళం, కన్నడం,హిందీ భాషల్లో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్‌ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్‌. ధాను ,ఏఎం రత్నం , నటుడు అజయ్‌ రత్నం తదితరులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత కలైపులి ఎస్‌ ధాను మాట్లాడుతూ ‘‘ చిత్ర టైలర్‌ చూస్తేనే నాగబంధం చిత్ర బ్రహ్మాండం కళ్ళకు కనిపిస్తోంది. అందులోని ప్రతి సన్నివేశంలోనూ చిత్ర వర్గాల శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడు అభిషేక్‌ నామ ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో రూపొందించారు.నాగం అనగానే ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి, నమ్మకం ,ఆధ్యాత్మిక భావన ఉంటుంది. నాగుపాము ఇతివృత్తంతో ఇంతకు ముందు రూపొందిన పలు చిత్రాలు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందాయి. ఆ విధంగా ఈ నాగబంధం చిత్రం కూడా ఘనవిజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకు ఉంది. ఈ చిత్రం హృదయపూర్వక శుభాకాంక్షలు ‘‘ అని పేర్కొన్నారు. మరో అతిథి ఏఎం. రత్నం మాట్లాడుతూ ‘‘సాంకేతిక పరిజ్ఞానం నానాటికి అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో సినిమా కూడా కొత్త పరిణామాలను చంచరించుకుంటోంది. ముఖ్యంగా డిజిటల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది అయిన కొన్ని చిత్రాలు మాత్రమే ఇవి కచ్చితంగా ధియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి కలుగుతుందనే భావనను కలిగిస్తాయన్నారు.అలాంటి చిత్రంగా నాగబంధం ఉంటుంది ‘‘ అని ఏఎం రత్నం పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement