మరో కార్మికురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

మరో కార్మికురాలి మృతి

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

● పదికి చేరిన మృతుల సంఖ్య ● బాధితుల వద్ద కలెక్టర్‌ విచారణ

తిరువళ్లూరు: అమోనియం గ్యాస్‌ లీకేజీ వ్యవహరంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం మరొకరు మృతి చెందారు. దీంతో అమోనియం గ్యాస్‌ లీకేజీ వ్యవహరంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్టు కలెక్టర్‌ కవిత తెలిపారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్‌ ఊత్తుకోట తాలుకా కన్నీగైపేర్‌ గ్రామంలో సెయింట్‌ పీటర్‌ అండ్‌ పాల్‌ సీపుడ్‌ ఎగుమతి చేసే ఫ్యాక్టరీలో ఈనెల 21న అమోనీయం గ్యాస్‌ లీకేజీ కారణంగా ప్రమాదం ఏర్పడింది. ప్రమాధంలో సుమారు 67 మంది సృహా కోల్పోయిన క్రమంలో వారిని సమీపంలోని ప్రవేటు వైద్యశాలకు తరలించి చికిత్సను అందించారు. ఈ క్రమంలో 9 మంది మరణించారు. కాగా బుధవారం ఒడిశాకు చెందిన జుభాషి జువాంగ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ప్రమాదం జరిగిన కంపెనీతో పాటు, కార్మికులు వున్న శిబిరాన్ని కలెక్టర్‌ కవిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం శిబిరంలో వున్న కార్మికులు ఆసక్తి వున్న వారు పనులకు వెళ్ళొచ్చని వద్దనుకుంటే సొంత గ్రామాలకు వెళ్లడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో సుమారు 200 టన్నుల రొయ్యెలను తరలించే కార్యక్రమం వేగంగా జరుగుతుందని, ఇప్పటికే పది టన్నుల రొయ్యెలను తరలించినట్టు వివరించారు. దీంతో పాటు ప్రమాధంలో 15 ఏళ్లబాలిక మృతి చెందినట్టు ఆధార్‌కార్డు ఆధారంగా గుర్తించామని, ఈ విషయంపై కార్మిక సంక్షేమశాఖను విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement