మొబైల్‌ బ్లడ్‌ డొనేషన్‌ వ్యాన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ బ్లడ్‌ డొనేషన్‌ వ్యాన్‌ పంపిణీ

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

సాక్షి, చైన్నె: ప్రజల ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాస్‌ , రోటరీ క్లబ్‌ ఆఫ్‌ చైన్నె లెజెండ్స్‌ వారా ఫ్యూచర్‌ ఎల్‌ఎల్‌పీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత ఆర్థిక సహకారంతో రూ. 35 లక్షల విలువైన, పూర్తి అత్యాధునిక వసతులు కలిగిన మొబైల్‌ బ్లడ్‌ డొనేషన్‌ వ్యాన్‌ను సిద్ధంచేశారు. దీనిని కొలత్తూరులోని నేషనల్‌ వాలంటరీ బ్లడ్‌ డొనేషన్‌ సెంటర్‌కు బహుమతిగా బుధవారం అందజేశాయి. చైన్నెలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ జానకి కాలేజీలో జరిగిన కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్‌ మురుగానందం . ఈ మొబైల్‌ బ్లడ్‌ డొనేషన్‌ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించి, సంబంధిత అధికారులకు తాళం అందజేశారు. ఈ అత్యాధునిక మొబైల్‌ వ్యాన్‌ ద్వారా చైన్నె నగరవ్యాప్తంగా ఉన్న అపార్ట్‌మెంట్లు, విద్యా సంస్థలు, కార్పొరేట్‌ ఐటీ కంపెనీలు, వివిధ అసోసియేషన్లు , నివాస ప్రాంతాల వద్దకే నేరుగా వెళ్లి ఉచితంగా రక్తదాన సేవలను సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ చైన్నె పోర్ట్‌ సిటీ ప్రెసిడెంట్‌ యూసుఫ్‌, చైన్నె ప్రీమియర్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె. భానుమతి, చైన్నె సఫైర్స్‌ ప్రెసిడెంట్‌ వనజ కృష్ణమూర్తి డాక్టర్‌ ఎంజీఆర్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లతా రాజేంద్రన్‌, రోటరీ గవర్నర్‌ నామినీ డిసిగ్నేట్‌ ఎస్‌. రవి, మాజీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ శరవణన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement