సాక్షి, చైన్నె: కాసాగ్రాండ్ గ్రూప్‌నకు చెందిన కమర్షియల్ విభాగం కోయంబత్తూరులో సేవలకు శ్రీకారం చుట్టింది. తమ మొదటి ప్రతిష్టాత్మక కమర్షియల్ ప్రాజెక్ట్ కాసాగ్రాండ్ క్రౌన్‌ను బుధవారం ప్రారంభించారు. కోయంబత్తూరులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవినాశి రోడ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు , స్టార్టప్‌లు , కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రీమియం ఆఫీస్ స్పేస్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ ఆఫీస్ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఆర్కిటెక్చర్, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలు, కామన్ కెఫెటేరియా , ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులు ఉన్నాయి. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ , ప్రధాన వ్యాపార ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ సులభమైన రవాణా కనెక్టివిటీని కలిగి ఉంది. కార్యక్రమంలో కాసాగ్రాండ్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివ శంకర్ రెడ్డి , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శబరీశ్వరన్ ఎమ్ తదితరులు పాల్గొన్నారు.


