అన్నామలైయార్‌ హుండీ ఆదాయం రూ.6.08కోట్లు | - | Sakshi
Sakshi News home page

అన్నామలైయార్‌ హుండీ ఆదాయం రూ.6.08కోట్లు

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.6.08 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరన్‌ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయంలో తమిళ ఆణిమాస హుండీ లెక్కింపును సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి సన్నిధి, అమ్మవారు, వినాయకుడు, అష్టలింగ ఆలయాల ప్రాంతాల్లోని 22 హుండీలను ఆలయ తిరుకల్యాణ మండపానికి తీసుకొచ్చి ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితో లెక్కించారు. లెక్కింపులో రూ.6,8, 64,491 నగదు, 188 గ్రాముల బంగారం, 1,695 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా హుండీలో వేసినట్లు తెలిపారు. నగదును ప్రభుత్వ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలున్నారు. భక్తులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని హుండీలను పెట్టేందుకు ఆలయ నిర్వాహకులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గిరివలయం రోడ్డులో కూడా హుండీలను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement