తిరువళ్లూరు: అమ్మోనియం గ్యాస్ లీకేజీతో పది మంది కార్మికులు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. మృతి చెందిన మహిళా కార్మికులకు పంచనామ నిర్వహించి ఒడిశాకు చెందిన అధికారుల సమక్షంలో బంధువులకు అప్పగించారు. అనంతరం మృతదేహాలను చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి విమానంలో సొంత గ్రామాలకు తరలించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం విజయ్ ఆదేశించారు. ఇందులో భాగంగానే త్రిసభ్య కమిటీ రెండు రోజులపాటు విచారణ జరిపి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ఫోరెనన్సిక్ సిబ్బంది ప్రమాధం జరిగిన ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అమ్మోనియం లీకేజీ ద్వారా ప్రమాధం జరిగిందా లేదా కుట్ర ఏమైనా వుందా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ అధికారులు సైతం కంపెనీలో విచారణ మొదలెట్టారు. అదికారుల తనిఖీల్లో అక్కడ ఉల్లంఘన జరిగిననట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు సంబంధిత కంపెనీకి సీల్ వేయాలని సిఫార్సు చేశారు. కార్మికుల భద్రతకు సంస్థ నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోలేదని, సేఫ్టీ పరికరాలు, సంస్థలో వైద్యులు నియమించకపోవడం, ఫస్ట్ ఎయిడ్ కేంద్రం లేదని సైతం నిర్ధారించారు. దీంతోపాటు సంస్థలో 18 వయస్సులోపు ఉన్నా కూడా పనుల్లో పెట్టుకున్నట్లు నిర్ధారించిన కార్మిక సంక్షేమశాఖ కఠిన చర్యల దిశగా పనులను ప్రారంభించారు. ఇది ఇలావుండగా సంస్థఽలో ప్రాసెసింగ్ యూనిట్ కేంఽద్రాల్లో ఇప్పటికే వెయ్యి టన్నుల రొయ్యలు వున్నట్టు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గుర్తించారు. సంబందిత రొయ్యలు నాణ్యమైనవా , ఎగుమతి చేయడానికి అవకాశం వున్న వాటిని గుర్తించి కంటైనర్ ద్వారా హార్బర్‌కు షిప్ట్ చేసే పనులను అధికారులు ప్రారంభించారు.


