తమిళసినిమా: సోమవారం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నటి కీర్తి సురేష్ దంపతులు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితురాలిగా ముద్ర వేసుకున్న నటి త్రిష ప్రతి ముఖ్య కార్యక్రమాల్లో వెన్నంటే ఉండే వారు.అలాంటిది ఈసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తన పుట్టిన రోజు వేడుకను ఆదివారం అర్ధరాత్రే కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఆ సమయంలో నటి త్రిష ఆయనతోనే ఉన్నారు. వారి ముందు ఉన్న ఐదు కేకుల ఫొటోలను నటి త్రిష తన ఇన్ స్ట్రాగామ్. పోస్ట్ చేసి, అన్నింటినీ అర్ధవంతంగా మార్చుతున్న ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


