ఫెర్టిలిటీ సెంటర్‌ సేవల విస్తృతం | - | Sakshi
Sakshi News home page

ఫెర్టిలిటీ సెంటర్‌ సేవల విస్తృతం

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

సాక్షి, చైన్నె : ఐవీఎఫ్‌ ,సంతాన సాఫల్య చికిత్స సేవల నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ చర్యలు తీసుకన్నామని ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవస్థాపకురాలు, లాపరోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రలేఖ తెలిపారు. తమ ఉనికిని మరింత విస్తరించే విధంగా అధునాతన సంతాన సాఫల్య వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, తిరువళ్లూరులో 84వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడు తూ, దంపతులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల ను, మానవతా దృక్పథంతో అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈకేంద్రాన్ని తీర్చిదిద్దామన్నారు. అత్యంత సురక్షితమైన , అనుకూలమైన వాతావరణంలో రోగులకు ప్రపంచస్థాయి చికిత్సను అందించేందుకు ఈ కేంద్రం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ లక్ష్మీమురళి, కార్యదర్శి డాక్టర్‌ గీతాప్రియ బాలాజీ, ట్రెజరర్‌ డాక్టర్‌ తమిళ్‌ సెల్వి, డిస్ట్రిక్ట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ కరుణాకరన్‌, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సాహిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement