నా నటనను ధనుష్‌ అభినందించారు..! | - | Sakshi
Sakshi News home page

నా నటనను ధనుష్‌ అభినందించారు..!

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

తమిళసినిమా: దర్శకుడు మీరా కదిరవన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన తాజా చిత్రం హబిబీ. నేశం ఎంటర్‌ టైన్మెంట్‌, జీకేఎస్‌ బ్రోస్‌ ప్రొడక్షన్స్‌, రోమియో పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్‌ దర్శకుడు, నటుడు ధనుష్‌, దర్శకుడు సెల్వరాఘవన్‌ లో తండ్రి కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించారు. నటి మాళవిక మనోజ్‌, నటుడు ఈశా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఇస్లామిక్‌ సముదాయం నేపథ్యంలో రూపొందింది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గత వారం తెరపైకి వచిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు రాజు మురుగన్‌, తమిళ్‌, నిర్మాత సురేష్‌ కామాక్షి మొదలగు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హబిబీ చిత్ర విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకుడు మీరా కదిరవన్‌ మాట్లాడుతూ 110 ఏళ్ల సినీ చరిత్రలో హబిబీ తన తొలి చిత్రం కావాలని భావించానన్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌ తనకు కొత్త కాదనీ, ఈ అనుభవం కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ సహోదరులను ఇంతకు ముందు చాలా చిత్రాల్లో తీవ్రవాదులుగా చిత్రీకరించారని, దాన్ని మార్చడమే ఈ చిత్రం పెద్ద విషయంగూ తాను భావిస్తున్నానన్నారు. దర్శకుడు కస్తూరి రాజా మాట్లాడుతూ తనను నటుడిగా మార్చిన గురువు దర్శకుడు మీరా కదిరవన్‌ అని పేర్కొన్నారు. హబిబీ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి చూశానన్నారు. తన పెద్ద కూతురు, డాక్టరు చాలా ధైర్యవంతురాలు అనీ, ఆమె ఈ చిత్రం చూసి ఏడ్చేశారని చెప్పారు. తన చిన్న చన్ను కొడుకు, నటుడు ధనుష్‌ చిత్రం చూసి చాలా గౌరవమైన చిత్రాన్ని చేశావు నాన్నా అని గట్టిగా వాటేసుకున్నారని చెప్పారు. తాను నటించినా, లేకపోయినా ఈ చిత్రంలో నటించిన అనుభవం చాలని కస్తూరి రాజా పేర్కొన్నారు.

శింబు, ధనుష్‌

కాంబోలో వడచైన్నె – 2

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement