తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం అంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అదేవిధంగా దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా వైవిధ్య భరిత కథా చిత్రాలకు చిరునామా. ఈయన ఇంతకు ముందు టైలర్ డర్డన్, కినో ఫీస్ట్ సంస్థలు అరణ్యకాండం, సూపర్ డీలక్స్ వంటి విమర్శల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా కాంబినేషన్లో వచ్చిన సూపర్ డీలక్స్ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు నటుడు విజయ్ సేతుపతికి జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. కాగా తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న చిత్రం పాకెట్ నావల్. నటి మాళవిక మోహన్ నాయకి గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్.బీ.శెట్టి, కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇ యళరాజా సంగీతాన్ని, నీరవ్ షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో షూటింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నాయని చెప్పారు. చిత్ర టైటిల్, టీజర్ లను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.


