తమిళసినిమా: టాలీవుడ్ యువ నటి వైష్ణవి చైతన్య కూడా బహు భాషా నటిగా ప్రమోట్ అయ్యారు. ఈ బ్యూటీ తెలుగులో బేబీ అనే హిట్ చిత్రంలో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ తాజాగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఈమె ఇంతకు ముందే అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే అందులో ఒక చిన్న పాత్రను పోషించారు. కాగా తాజాగా హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు తిట్టం ఒండ్రు, అడియే, హాట్ స్పాట్ 1,2 చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా అడియే చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించారన్నది గమనార్హం.కాగా ఈ కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుందని సమాచారం. గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ ఈ చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్న తెలిసింది. తాజాగా రెండో షెడ్యూల్ చిత్రీకరణకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రంతో హైదరాబాద్ బ్యూరో వైష్ణవి చైతన్య కథానాయకిగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారన్న మాట. దీంతో ఈ రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంపై ఆసక్తి నెలకొంది.


