యోగాతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ప్రశాంతత

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

కొరుక్కుపేట: నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో ఉంటారని మాజీ తెలంగాణ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పిరమిడ్‌ స్పిర్చువల్‌ సొసైటీ మూమెంట్‌ (పీఎస్‌ఎస్‌ఎం)–పీఎంసీ య్యూటూబ్‌ ఛానెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె విల్లివాక్కంలోని అజంతా విజయ శంకర్‌ మహాల్‌లో రెండ్రోజుల ’అఖండ ధ్యానం’ వేడుకలు ఆదివారం తో వైభవంగా ముగిశాయి. పీఎస్టి చైన్నె కార్యదర్శి, యోగా గురువు అమరా చంద్రశేఖర్‌– ప్రశాంతి దంపతులు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో చివరి రోజు ఆదివారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణా మాజీ గవర్నర్‌, బిజేపీ నాయకురాలు తమిళిసై పాల్గొని యోగా గురించి వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement