కత్తులతో హల్‌చల్‌ : అన్నదమ్ముల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కత్తులతో హల్‌చల్‌ : అన్నదమ్ముల అరెస్ట్‌

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

తిరువళ్లూరు: తాము రౌడీలమంటూ రోడ్డులో కత్తులతో హల్‌చల్‌ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం సమీపంలో గురువారం రాత్రి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇళంగో నేతృత్వంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో రోడ్డులో కత్తులతో హల్‌చల్‌ చేస్తూ ప్రజలపై వీరంగం చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకులను పోలీసులపై తిరగబడ్డారు. అంతుచూస్తామని బెదిరించారు. వారిని బలప్రయోగంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రాధమిక విచారణలో వారిద్దరూ రామతండలం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన తెన్నరసు(23), అశ్వంత్‌(21)అని, వీరిపై పలు పోలీసుస్టేషన్‌లో కేసులు ఉన్నట్లు తేలింది. అనంతరం వీరిని కోర్టుకో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement