క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

టాస్మాక్‌ బార్‌లో గొడవ ● స్నేహితుడు హత్య అలరించిన అన్నమమ్య కీర్తనలు తాంబరంలో సిగ్నల్‌ వైఫల్యం ● ఆగిన రైళ్లు గ్రామసభలతోనే సమస్యలకు పరిష్కారం

తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానలా మారి, ఒకరు ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది. వినోద్‌ ఆకాష్‌ (23), ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. మణికంఠన్‌ (30). గురువారం సాయంత్రం వీరిద్దరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన మణికంఠన్‌ రాయితో వినోద్‌ తలపై బలంగా కొట్టాడు. వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.

కొరుక్కుపేట: అన్నమయ్య కీర్తనలతో నగరానికి చెందిన తెలుగు గాయని అరుణ ఆధ్యంతం అలరించింది. వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతా కల్యాణ వైభవం పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చైన్నె పటేల్‌ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా గురు వారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం రాత్రి గాయని అరుణ సంగీత కచ్చేరి ఇచ్చారు. కీ బోర్డుపై ఎన్‌ వి బాబు, తబలాపై రమేష్‌ వాయిద్య సహకారం అందించారు. గాయకుడు ఎం ఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నమాచార్య కీర్తనలను అలపించి అలరించారు. కళాకారులను తమ్మినేనిబాబు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుడిమెట్ల చెన్నయ్య, విజయలక్ష్మి, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

కొరుక్కుపేట: తాంబరం, పరంతూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిగ్నల్‌ సిస్టం వైఫల్యం చెందింది. దీంతో ట్రాక్‌పై ఉన్న సిగ్నల్‌ బాక్సులు పనిచేయలేదు. ఫలితంగా చెంగల్పట్టు మార్గం నుంచి తాంబరం వైపు వచ్చే ఎలక్ట్రిక్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సిగ్నలింగ్‌ ఇవ్వడం కుదరలేదు. ఈ వైపు నుంచి రైళ్లన్నింటినీ కొన్నిచోట్ల నిలిపివేశారు. అలాగే, తాంబరం నుంచి చైన్నె వెళ్లే రైళ్లను కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లలో చిక్కుకుపోయారు. పాఠశాలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు పైగా రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు తాంబరం రైల్వేస్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆ తర్వాత 9.30 గంటల తర్వాత సిగ్నల్‌ సమస్యను సరిదిద్దారు. ఆ తర్వాత, అన్ని రైళ్లు యథావిధిగా నడిచాయి.

వేలూరు: గ్రామసభలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేలూరు ఎంపీ కదిర్‌ఆనంద్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని వంజూరు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభ సమావేశంలో ఎంపీ కదిర్‌ఆనంద్‌ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించారు. వేలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్‌ వీఎస్‌ లీల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement