సాక్షి, చైన్నె: ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా రెయిన్‌బో చిల్డ్రన్‌్స్ హాస్పిటల్ నేతృత్వంలో బుధవారం వినూత్నంగా హ్యాపీ వైబ్స్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె షోళింగనల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల్లోని వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఆనందాన్ని పెంపొందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో 20 మందికి పైగా పిల్లలు తమ తల్లిదండ్రులతో కలసి తమలోని ప్రత్యేక సామర్థ్యాలను చాటుకునే ప్రయత్నం చేశారు. పీడియాట్రిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ పెరుమాళ్ సత్య, ఫెసిలిటీ డైరెక్టర్ జాన్ పాల్ విజయ్ ఈసందర్భంగా మాట్లాడారు. తాము కేవలం వైద్య సంరక్షణకే పరిమితం కాకుండా, పిల్లల సంక్షేమం లక్ష్యంగా ప్రత్యేక చొరవతో ముందుకెళుతున్నామన్నారు. ప్రతి బిడ్డలోని ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించి వారిలో మరింత ఉత్సాహం, ప్రోత్సహం దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. పిల్లల కోసం సమగ్ర బాలల అభివృద్ధి కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసి, వైద్య చికిత్సతో పాటు మానసిక సామాజిక మద్దతును అందిస్తున్నామని తెలియజేశారు.


