25 కుటుంబాలకు చేపల వలల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

25 కుటుంబాలకు చేపల వలల పంపిణీ

Mar 8 2026 7:59 AM | Updated on Mar 8 2026 7:59 AM

తిరువళ్లూరు: పొన్నేరి యూనియన్‌లో అర్హులైన 25 మంది ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా చేపల వలలను కలెక్టర్‌ ప్రతాప్‌ శనివారం ఉదయం పంపిణీ చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా పరిధిలోని మెదూరు గ్రామంలో సుమారు 30 ఎస్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరికి చేపల వేటే ప్రధాన ఆధారం. కాగా చేపల వేటకు పాత వలలు ఉపయోగిసున్న క్రమంలో కొత్త చేపలవలలను అందించాలని స్టీలు కలెక్టర్‌ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. సంబందిత వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ అర్హులైన వారికి ఆదిద్రావిడ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపల వలను ఉచితంగా అందించే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే 25 కుటుంబాలకు రూ.1.84 లక్షల విలువ చేసే చేపల వలను కలెక్టర్‌ ప్రతాప్‌ అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement