రంగంలోకి పారా మిలటరీ దళాలు | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి పారా మిలటరీ దళాలు

Mar 8 2026 7:58 AM | Updated on Mar 8 2026 7:58 AM

సాక్షి, చైన్నె: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల విధుల నిమిత్తం పారా మిలటరీ బృందాలు చైన్నెకు చేరుకుంటున్నాయి. తొలి బృందంగా 211 మంది చైన్నెకు శనివారం వచ్చారు. వీరంతా కేకేనగర్‌, గిండి, వాషర్‌మెన్‌ పేటలో విధు లు నిర్వర్తించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నగా రా మోగేందుకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో భద్రతా విధులు, వాహన తనిఖీలు, నగదు బట్వాడాపై నిఘా ఉంచే దిశగా పారా మిలరీని దళాలలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ రంగంలోకి దించే పనిలో పడింది.

ఇరాన్‌లో కన్యాకుమారి జాలర్ల అవస్థలు

సాక్షి, చైన్నె: ఇరాన్‌లో పదుల సంఖ్యలో కన్యాకుమారి జాలర్లు చిక్కుకుని ఉన్నారు. తమను రక్షించాలంటూ కుటుంబ సభ్యులకు వీడియో సందేశాలను పంపించారు. వివరాలు.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రయెల్‌ దాడులను విస్తృతం చేసిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా దేశాలలోని సుమారు పదిహేను లక్షల మంది తమిళులలో ఆందోళన నెలకొంది. వీరందరూ సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో కన్యాకుమారి నుంచి ఇరాన్‌కు చేపల ఎగుమతి పరిశ్రమ లో విధులకు చేరిన పదుల సంఖ్యలో జాలర్లు తాజాగా అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కు మంటు కాలం గడుపుతున్నారు. చిన్న పాటి గదులలో పదిమంది చొప్పున ఉంటూ బయటకు రాలేక, ఉన్నదాంతో సర్దుకుంటూ, అర్ధాకలితో అలమటిస్తుండటం వెలుగు చూసింది. వీరంతా తాము పడుతున్న వేదన, కష్టాలు, ఆందోళన గురించి వీడియో సందేశాన్ని కన్యాకుమారిలోని కుటుంబ సభ్యులకు శనివారం పంపించారు. తమను రక్షించే తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఏ క్షణాన తమప్రాణాలు పోతాయో అన్న భయంతో బతుకుతున్నామని, తక్షణం ప్రభుత్వాన్ని సంప్రదించి తమను ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కన్యాకుమారి కలెక్టర్‌కు చేరుకుని తమవారిని రక్షించాలని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి నాజర్‌ మాట్లాడుతూ, తమిళులు సురక్షితంగా ఉన్నారని, ఎవ్వరైతే ఇక్కడకు వచ్చేస్తామని సమాచారం ఇస్తారో వారిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణ సాయం,సేవలకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు.

రూ. 12 కోట్లతో కొత్త వంతెన

కొరుక్కుపేట: విరుగంబాక్కం–అరుంబాక్కం నదీముఖద్వారం మీదుగా ఉన్న వంతెనను కూల్చివేసి, రూ.12.31 కోట్లతో కొత్త వంతెన నిర్మించేందుకు చైన్నె మెట్రో రైలు కార్పొరేషన్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీకి కాంట్రాక్టును అప్పగించింది. ఈ ప్రాజెక్టును 180 రోజుల్లోపు పూర్తి చేయడానికి గడువు నిర్ణయించారు. ఈమేరకు మెట్రో కంపెనీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కొత్త వంతెన పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. చైన్నె మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ ఆర్చ్‌ సునన్‌ సమక్షంలో, చైన్నె ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఒప్పందంపై సంతకం చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైన్నె మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డి. జెపాసెల్విన్‌ క్లాట్సన్‌, రేఖ ప్రకాష్‌ పాల్గొన్నారు.

‘భారతియార్‌ ఇల్లం’

ఇన్‌స్ట్రాగామ్‌ పేజీ ఆవిష్కరణ

సాక్షి, చైన్నె : మహాకవి భారతియార్‌ స్మారకంగా కొత్త ఇన్‌స్ట్రాగామ్‌ పేజీని సమాచార శాఖ ప్రారంభించింది. యువతకు చేరువగా ’భారతియార్‌ ఇల్లం’ పేరిట ఈ పేజీ రూపొదించారు. మహిళా హక్కులు, సమానత్వం స్వేచ్ఛను చాటిచెప్పే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల క్రితమే మహిళా హక్కుల కోసం గళమెత్తిన విప్లవ కవి, మహాకవి సుబ్రమణ్య భారతియార్‌ జ్ఞాపకార్థం, ప్రస్తుత యువతకు ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ’భారతియార్‌ ఇల్లం’ పేరుతో కొత్త ఇనన్‌స్ట్రాగామ్‌ పేజీని ప్రభుత్వం ప్రారంభించింది. సుబ్రమణ్య భారతియార్‌ కేవలం కవి మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, మహిళా సాధికారతకు మార్గదర్శి అని చాటి చెప్పే దిశగా ఈపేజీ రూపకల్పన చేశారు. చిన్న వయస్సులోనే ఆయన కవితా ప్రతిభకు ముగ్ధులై ’భారతి’ అనే బిరుదును ప్రదానం చేశారు. కుల నిర్మూలన, దేశభక్తి, సీ్త్ర స్వేచ్ఛ ,మానవత్వమే ఆయన కవితల ప్రధాన ఇతివృత్తాలుగా చెప్పవచ్చు. నేటి తరం యువతకు సోషల్‌ మీడియా ద్వారా భారతియార్‌ కవితలు, చరిత్రను సులభంగా చేరవేయాలనే లక్ష్యంతో సమాచార శాఖ ఈ పేజీని సిద్ధం చేసింది. ఇందులో భారతియార్‌ అరుదైన ఫొటోలు, చారిత్రక వీడియోలు, ఆయన రాసిన ఉత్తేజకరమైన కవితలు, చరిత్రకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇందులో నిరంతరం అప్‌లోడ్‌ చేయనున్నారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, సామాజిక బాధ్యతను పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement