సాక్షి, చైన్నె: అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డీజే, ప్రొడ్యూసర్ కాశ్మీర్ అ ద్భుతమైన ప్రదర్శనతో విజయవంతంగా జరిగిందని నిర్వాహకులు శని వారం ప్రకటించారు. తన ఇండియా టూర్‌లో భాగంగా రెండో స్టాప్‌గా సన్ బర్న్ యూనియన్ వేదికగా తనదైన శైలిలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌ను భారతీయ సాంస్క్కృతిక అంశాలతో మిళితం చేసి సంగీత ప్రియులను అలరించారని తెలిపారు. కార్యక్రమం ప్రారంభం కాగానే కాశ్మీర్ తన ఐకానిక్ హిట్స్‌పాటలతో అభిమానులను హోరెత్తించారన్నారు.ఈ విషయంగా సన్‌బర్న్ సీఈఓ కరణ్ సింగ్ మాట్లాడుతూ, అత్యంత ఉత్తేజకరమైన వేడుకగా కాశ్మీర్‌కు భారతదేశంతో విడదీయలేని అనుబంధం ఉందని ఆయన చాటినట్టు పేర్కొన్నారు. శనివారం భువనేశ్వర్, ఆదివారం హైదరాబాద్‌లలోనూ ఈసంగీత వేడుక జరగనున్నట్టు తెలిపారు.


