సాక్షి, చైన్నె : డీఎంకేలో సీట్ల కోసం 15 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఈ సారీ అభ్యర్థుల ఎంపికకు డీఎంకే కఠిన నిబంధనలు అనుసరించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి డీఎంకే 170 స్థానాలలో పోటీ చేయవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇప్పటి కే కాంగ్రెస్‌కు 28 , మరో రెండు పార్టీలకు తలా రెండు సీట్లు కేటాయించింది. మిగిలిన వారందరికి ఆది లేదా సోమవారం సీట్ల పంపకాలు జరగనున్నాయి. ఈ పరిస్థితులలో డీఎంకే తరపున పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు గత వారం రోజులు స్వీకరించారు. ఈప్రక్రియలో 15,372 దరఖాస్తులు వచ్చి చేరాయి. అధిక శాతం మంది సీట్లు ఆశిస్తూ దరఖాస్తు చేసుకోగా, మరి కొందరు తమకు నచ్చిన, ముఖ్య నేతలు తమతమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేయడం గమనార్హం.


