వేలూరు: వేలూరు వేలపాడిలోని గ్రామ దేవతైన శ్రీ ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ నిర్వహక కమిటీ సభ్యులు అములు, డాక్టర్ అయ్యప్పన్, వేణు అద్యక్షతన ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని రఽథంలో ఆశీనులు చేసి దీపారధన పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో పాటూ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణాల మధ్య రథాన్ని లాగారు. ఈ రథం వేలపాడిలోని పలు వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రతి ఇంటి ముందు మహిళా భక్తులు బొరుగులు, ఉప్పు, మిర్యాలు, పుష్పాలు చల్లడంతో పాటూ కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు దాతలు, పారిశ్రామికవేత్తలు అన్నదానం చేశారు.


