వేలూరు: సమాజంలో మంచి పౌరులుగా ఎదిగే విధంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత టీచర్‌లపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి కుమరన్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు యూనియన్ పరిధిలోని మూల గేటులోని ప్రభుత్వ పాఠశాలలో తిరువళ్లువర్ సాహిత్య సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం పాఠశాల హెచ్‌ఎం జోసెఫ్ అన్నయ్య అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సంఘాన్ని కవి డాక్టర్ ఎస్. లక్ష్మీపతి ప్రారంభించగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి పాల్గొని వ్యాకరణం, సాహిత్యాన్ని రెండు కళ్లతో రక్షించుకోవాలన్నారు. అనంతరం తిరువళ్లువర్ సాహిత్య వేదికను ప్రారంభించి తిరుక్కురల్ విభాగంలో ప్రశ్నలు అడిగి అందుకు సమాధానం చెప్పిన విద్యార్థులకు, తిరుక్కురల్ ను చూడకుండా చెప్పిన విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మరియ పుణిత, వేలూరు రీడర్స్ డిప్యూటీ కార్యదర్శి రాజన్ బాబు, టీచర్ జయంతి పాల్గొన్నారు.


