తమిళసినిమా: మన నటీమణీల ఆశలు, కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరి కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు మంచి మనిషై ఉంటే చాలంటారు. మరికొందరు నా మనసెరిగి నడుచుకోవాలంటారు. ఇంకొందరు తమను గౌరవించే వారై ఉండాలంటారు. కాగా మీనాక్షి చౌదరి ఎలాంటి భర్త కావాలంటున్నారో తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవుతారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన బ్యూటీ ఈ అమ్మడు. తెలుగులో హిట్ చిత్రం ద్వారా కథానాయిక కాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మీనాక్షిచౌదరి. ఇదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమలోకి విజయ్‌ఆంటోనీ హీరోగా నటించిన కొలై చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆర్ జే.బాలాజి సరసన సింగపూర్ సెలూన్ చిత్రంలో నటించినా, రాని గుర్తింపు విజయ్‌కి జంటగా నటించిన గోట్ చిత్రంతో వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే.గోట్ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు . హీరో విజయ్ అన్న ఒక్క పేరు వల్లే నటి మీనాక్షిచౌదరి పేరు పాపులర్ అయింది. ఆ తరువాత దుల్కర్‌సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత తెలుగులో మహేష్‌బాబుతో కలసి గుంటూరు కారం, వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం, తాజాగా అనగనగా ఒక రాజు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల యముడు ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న విషయం గురించి పెద్ద లిస్టే చెప్పారు. అవి ఏమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కనీసం 100 ఎకరాల ఆస్తి పరుడై ఉండాలి. వంట తెలిసినవాడై ఉండాలి. బట్టలు ఉతకడం, ఇసీ్త్ర చేయడం తెలిసినవారై ఉండాలి. మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
మీనాక్షి చౌదరి
ఆడియోను
ఆవిష్కరించిన
అతిథులు,
యూనిట్
సభ్యులు


