గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
వేలూరు: వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలో పలు చోట్ల గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీస్ ఇన్సెపెక్టర్ శరవణన్ అధ్యక్షతన పోలీసులు శుక్రవారం సాయంత్రం కాట్పాడి– కేవీ కుప్పం రోడ్డులోని సెన్నాంకుప్పం గ్రామం వద్ద వాహనాల త నఖీ చేపట్టారు. ఆ సమయంలో బైకులో అనుమానాస్పదంగా ముగ్గురు యువకులు వస్తుండడంతో విచారణ చేపట్టారు. ఆ సమయంలో వారు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వీరు ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి బైకులో తీసుకొచ్చి వేలూరు జిల్లాలోని కేవీ కుప్పం, గుడియాత్తం వంటి ప్రాంతాల్లో విక్రయం చేస్టున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు చిత్తూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్, వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన దిలీఫ్, సంతోష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆరు కిలోల గంజాను స్వాధీనం చేసుకొని గుడియాత్తం కోర్టులో హాజరు పరిచి ౖవేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
గూడువాంచేరిలో మెమోరియల్ పార్క్‌కు నల్లకన్ను పేరు
కొరుక్కుపేట: చెంగల్పట్టు జిల్లా నందివరంలోని గుడువాంచేరి వార్డు జయరామ్ నగర్‌లో మునిసిపాలిటీ పరిధిలోని 3వ కలైంజ్ఞర్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత ఆర్. నల్లకన్ను మెమోరియల్ పార్కు పేరు పెట్టారు. ఈ పార్క్‌ను దండపాణి రిబ్బన్ కట్ చేసి ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి, నగర మండలి అధ్యక్షుడు , నగర మేనేజర్ కార్తీక్ మున్సిపల్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, న్యాయవాది జి.కె.లోగనాథన్, మున్సిపల్ ఇంజినీర్ వెంకటేశన్, మున్సిపల్ కౌన్సిలర్ రాజి హాజరయ్యారు.
మోటార్ సైకిల్‌ను ఢీకొన్న లారీ
తిరువళ్లూరు: తిరువళ్లూరుకు సమీపంలోని మెయ్యూరు ప్రాంతానికి చెందిన వారు మదన్ కు మార్ కుమారుడు యశ్వంత్(13). తిరువళ్లూరు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అదే ఊరికి చెందిన ఆవడిలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థి రాజ్‌ప్రియన్ (19), తన స్నేహితుడు రిషి (18)తో కలిసి మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. వా రు యశ్వంత్‌ను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని మెయ్యూరు వైపు బయలుదేరారు. తిరువళ్లూరు కు సమీపంలోని ఈక్కాడు ప్రాంతంలో చైన్నె–తిరుపతి జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్ దగ్గర వెళుతుండగా వెనుక నుండి వచ్చి న లారీ, మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమా దంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థాని కులు వారిని రక్షించి 108 అంబులెన్స్ సహాయంతో తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అక్కడ పాఠశాల విద్యార్థి యశ్వంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.
చైన్నె బ్యాంకులో చోరీకి యత్నం
– లాకర్ తెరవలేక దొంగ పరారీ
తిరువొత్తియూరు: చైన్నె బ్యాంకులోకి చొరబడిన ముసుగు దొంగ 4 గంటలపాటు పోరాడినా, నగలు, డబ్బు ఉన్న లాకర్‌ను తెరవలేక నిరాశతో పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. చైన్నె పశ్చిమ మాంబళంలోని పోస్టల్ కాలనీలో ప్రభుత్వ బ్యాంకు ఉంది. ఇక్కడ ఎప్పటిలాగే ఉదయం పారిశుధ్య కార్మికురాలు సరస్వతి శుభ్రం చేయడానికి వచ్చింది. ఆ సమయంలో షట్టర్ తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. దీని గురించి వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో అశోక్ నగర్ పోలీసులు, బ్యాంకు అధికారులు వచ్చారు. బ్యాంకులోకి ప్రవేశించినప్పుడు, అనేక పత్రాలు చిందరవందరగా చించివేయబడి ఉండటాన్ని చూశారు. మరింత పరిశీలించినప్పుడు డబ్బు లేదా విలువైన వస్తువులు ఏవీ దొంగిలించబడలేదని నిర్ధారించారు. దీని తరువాత పోలీసులు సీసీటీవీ దశ్యాలను పరిశీలించారు. అందులో ముసుగు ధరించిన వ్యక్తి టార్చ్‌లైట్‌తో వెళ్లి క్యాషియర్ గదిలోకి ప్రవేశించి డబ్బు కోసం వెతకడం, లాకర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించడం తెలిసింది. ఆ ముసుగు ధరించిన దొంగ సుమారు 4 గంటలు పోరాడినా లాకర్‌ను పగలగొట్టలేక నిరాశ చెందాడు. అందువల్ల తన ప్రయత్నం విఫలమవడంతో ఆగ్రహానికి గురైన అతను, పారిపోయే ముందు అనేక పత్రాలను చించిపారేసినట్లు తెలిసింది. అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.
సంక్షేమ సహాయకాల వితరణ
కొరుక్కుపేట: చైన్నెకి చెందిన ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉత్తర, దక్షిణ భారత దేశపు వలస కూలీలకు ఉగాది సందర్భంగా సంక్షేమ సహాయకాలు అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఏవీ శివకుమారి పాల్గొని వలస కూలీలకు నూతన వస్త్రాలు, నగదును వితరణగా అందజేశారు.


