కాన్‌ సిటీటీజర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

కాన్‌ సిటీటీజర్‌ విడుదల

Mar 8 2026 7:58 AM | Updated on Mar 8 2026 7:58 AM

తమిళసినిమా: నటుడు అర్జున్‌ దాస్‌, ప్రముఖ మలయాళ నటి అన్నాబెన్‌ జంటగా నటించిన చిత్రం కాన్‌ సిటీ. యోగిబాబు, వడివుక్కరసి, బాలనటుడు అఖిలన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. పవర్‌ హౌస్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ దురైరాజ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ కథ, కథనాలు కొత్తగా ఉంటాయి అన్నారు. అర్జున్‌దాస్‌కు ఇందులోని పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు. బెంగళూరు, చైన్నె, ముంబై ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. కుటుంబ అనుబంధాలు, నగర యథార్థ జీవన విధానాన్ని ఆవిష్కరించే ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. కాన్‌ సిటీ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. చిత్ర టైటిల్‌, టిజర్‌ను విడుదల చేశామని, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. చిత్రం పూర్తిగా కమర్షియల్‌ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని, అరవింద్‌ విశ్వనాథన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement