ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు రబ్బర్ పడవలు
తిరువళ్లూరు: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు కేటాయించిన 25 రబ్బర్ పడవల పనితీరును అధికారులు పూండి రిజర్వాయర్‌లో పరిశీలించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ విపత్తు జరిగినా అక్కడికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లి సహాయ చర్యలను చేపడుతున్న విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అరక్కోణంకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేవి. అయితే 2017వ సంవత్సరంలో 30 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి తద్వారా సహాయక చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆవడికి చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి ఇటీవల 25 పడవలను కేటాయించారు. ఈ పడవల పనితీరు, ఎంత బరువు మోయగలదు, గాలికి ఎదురుగా వెళ్లే సామర్థ్యం ఉందా అనే అంశాన్ని పరిశీలించడానికి పూండిలోని సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, ఆవడిలోని పరుత్తిపట్టు చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్‌రన్ సక్సెస్ అయినట్టు ప్రకటించిన అధికారులు, రబ్బర్ పడవలు గాలిలోనూ ఎంత వేగంతో వెళ్ళగలం, ఏ దిశలో పడవలను నడపవచ్చు అనే అంశాన్ని పరిశీలించినట్టు తెలిపారు. రబ్బర్ పడవల ట్రయల్‌రన్‌లో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు రబ్బర్ పడవలు


