
విద్యతోపాటు క్రీడలూ అవసరం
వేలూరు: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్య మని వేలూరు నరువి ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ అన్నారు. వేలూరు సత్‌వచ్చారిలోని ఎత్తిరాజ్ మెట్రిక్ పాఠశాలలో 32వ వార్షిక క్రీడా దినోత్సవం పాఠశాల ట్రస్ట్ సభ్యుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ఆయన ప్రసంగించారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులకు ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివేలా అలవాటు చేయాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. పారిశ్రామిక వేత్త టీఎస్ ఉదయశంకర్, ప్రజాసభ్యుడు శరవణ ప్రసాద్, సభ్యులు ప్రకాష్, హెచ్‌ఎం షర్మిల, టీచర్‌లు పాల్గొన్నారు.