
పురుగుల మందు తాగి సోదరుల ఆత్మహత్య
తిరువళ్లూరు: పురుగుల మందు తాగిన సోదరు లు చికిత్స ఫలించక మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా నుంగంబాక్కం కమ్మవారిపాళ్యం గ్రామానికి చెందిన డ్రైవర్ మోహన్ జయలక్ష్మి దంపతులు. వీరికి మొత్తం నలుగురు కొడుకులు వున్నారు. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మోహన్ విడిపోయి వేరే మహిహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. పెద్దకొడుకు గణేష్ శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే గణేష్ వివాహానికి తల్లి జయలక్ష్మి అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. కాగా మరో కొడుకు విఘ్నేష్ మద్యంకు బానిస కావడంతో తల్లి తీవ్ర మనోఽవేదనకు గురైన తల్లి జయలక్ష్మి గత 25న పురుగుల మందు తీసుకొచ్చి కొడుకుల ఎదుటే తాగడానికి యత్నించింది. అయితే తల్లిని అడ్డుకుని ఇద్దరు కొడుకులు ఆదే విషాన్ని లాక్కుని ఇద్దరు కొడుకులు సేవించగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. తిరువళ్లూరులో ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన చిక్సిత కోసం చైన్నెలోని ప్రవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ ఇద్దరు గురువారం మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చైన్ స్నాచర్‌పై పోక్సో కేసు
తిరువొత్తియూరు: పెరుంగుడి రైల్వేస్టేషన్‌న్‌లో టీచర్ వద్ద అసభ్యంగా ప్రవర్తించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. చైన్నె కోట్టూరు పురానికి చెందిన టీచర్ రోసీతో అసభ్యంగా ప్రవర్తించి పెరంగుడి ఫ్లయింగ్ రైల్వేస్టేషన్‌న్‌లో గుర్తు తెలియని యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విల్లుపురం సెంగిమేడుకు చెందిన సౌందర్‌ను 3 గంటల్లో అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
సర్వ దర్శనానికి 15 గంటలు
తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్వనానికి 15గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,303 మంది స్వామి వారిని దర్శించుకోగా 27,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.