
మతం కంటే మానవత్వం గొప్పది
కొరుక్కుపేట: మానవత్వం కంటే ఏ మతమూ గొప్పది కాదని సెంట్రల్ లా కాలేజీ చైర్మన్ డి.శరవణన్ అన్నారు. న్యాయ వ్యవస్థను సంస్కరించడం, మానవ హక్కులు, మానసిక ఆరోగ్యం, నేరాల్లో యువత ప్రమేయం, పునరావాసం్ఙ అనే అంశంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం బుధవారం సేలంలోని సెంట్రల్ లా కాలేజీలో జరిగింది. ఇందులో దేశం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు శరవణన్ మంచి సమాజానికి న్యాయమైన నిష్పాక్షికమైన న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమని చెప్పారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నేరాలు మానవ హక్కుల ఉల్లంఘనల రేటుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎస్.మణికుమార్ మాట్లాడుతూ బలమైన చట్టాలు అవసరమని పేర్కొన్నారు. జస్టిస్ టి. మురుగేశన్, తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు విభాగం డైరెక్టర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్. మల్లిక, డాక్టర్ మణికందన్ సౌందరరాజన్, తూర్పు లండన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ రువాన్ ఉడువెరాజ్ పెరెరా, సచ్చితానంద వాలన్ మైఖేల్, హెన్రీ టిఫాగ్నే, డాక్టర్ గుర్మిందర్ కౌర్ పాల్గొన్నారు.