
3వ తరం ఎకో షో 5 స్మార్ట్ డిస్ ప్లే ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అమెజాన్ అలెక్సాన్ ఇండియాతో కలిసి మూడవ తరం ఎకో షో 5 స్మార్ట్ డిస్‌ప్లేను ఆవిష్కరించింది. ఇది సులభంగా ఇంటి పర్యవేక్షణ, స్ట్రీమింగ్ అనుకూలమైన భద్రతా కెమెరా వీడియో ఫీడ్‌లు, ఆడియో–విజువల్ కంటెంట్‌ను చూడటం , మరిన్నింటి కోసం అంతర్నిర్మిత కెమెరాతో కూడిన కాంపాక్ట్ 5.5 స్మార్ట్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉన్నట్టు గురువారం స్థానికంగా ప్రకటించారు. దీని గురించి అమెజాన్ డివైసెస్ ఇండియా డైరెక్టర్ ఆర్‌ఎస్ దిలీప్ వివరిస్తూ ఇది మునుపటి తరంతో పోలిస్తే 2 ఎక్స్ బేస్, స్పష్టమైన ధ్వనితో ఉత్తమంగా ధ్వనించే ఎకోషో 5 అని వివరించారు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమాలతో పాటూ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉందని వివరించారు. అలెక్సాతో రోజువారీ క్షణాలను మరింత ఉపయోగకరంగా మార్చడానికి రూపొందించబడినట్టు వివరించారు.