
పోలీస్ శిక్షణ కేంద్రం ప్రారంభం
వేలూరు: పోలీస్ శిక్షణ కేంద్రం ఆరోగ్యకరమైన ప్రాంతంలో ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని సేవూరు గ్రామ కొండ ప్రాంతం వద్ద రూ.4.77 కోట్ల వ్యయంతో తమిళనాడు ప్రత్యేక 15వ బెటాలియన్ కార్యాలయ భవనాన్ని సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం భవన నిర్మాణ పనులు, పోలీసుల విశ్రాంతి గది, శిక్షణ కేంద్రం, తరగతి గదులను పరిశీలించారు. ఎమ్మెల్యే కార్తికేయన్, కాట్పాడి యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, వేలూరు కార్పొరేషన్ మొదటి జోన్ చైర్మన్ పుష్పలత, తమిళనాడు ప్రత్యేక 15వ బెటాలియన్ ప్రత్యేక అధికారి సెల్వమణి, అసిస్టెంట్ అధికారి ప్రకాష్, సర్పంచ్ రేవతి పాల్గొన్నారు.