
కాజల్ @ 40
తమిళసినిమా: చందమామ లాంటి అందమైన నగుమోము కలిగిన నటి కాజల్‌అగర్వాల్. ఈ ఉత్తరాది భామ హిందీలో కంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం చిత్రాల్లోనే ఎక్కువగా నటించి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. 2004లో దిల్ హో గయానో అనే చిత్రం ద్వారా కాజల్ అగర్వాల్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా నటిగా రెండు దశాబ్దాలను అధిగమించి కథానాయకిగా రాణిస్తున్న నటి ఈ బ్యూటీ. తెలుగులో లక్ష్మీకల్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న కాజల్ అగర్వాల్ రామ్‌చరణ్‌తో జంటగా నటించిన మగధీర మంచి పేరు తెచ్చిపెట్టడంతోపాటు స్టార్ హీరోయిన్‌ను చేసింది. అదేవిధంగా తమిళంలో పేరరసు దర్శకత్వంలో రూపొందిన పళని చిత్రంలో భరత్‌కు జంటగా నటించి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి అగ్రనాయకిగా రాణించారు. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అందుకు కారణం కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం కూడా కావచ్చు. 2020లో గౌతమ్‌కిచ్చి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరికి నీల్‌కిచ్చి అనే కొడుకు కూడా పుట్టాడు. కాగా గురువారం కాజల్ అగర్వాల్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె భర్త కుమారుడితో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా కాజల్‌అగర్వాల్‌కు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. చివరిగా నటించిన హిందీ చిత్రం సికందర్. ఐదు కోట్ల వరకు పాతేసుకో పుచ్చుకున్న ఈ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి కాజల్ అగర్వాల్ నటించిన ఇండియన్–3 చిత్రం త్వరలో తెరపైకి రానుందనే ప్రచారం జరుగుతోంది. లేకపోతే నటిగా ఈ అమ్మడు ఆస్తులను బాగానే కూడా పెట్టిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.