ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన సాధనం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన సాధనం

Jun 20 2025 5:49 AM | Updated on Jun 20 2025 5:49 AM

ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన సాధనం

ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన సాధనం

కొరుక్కుపేట: శారీరక మానసిక ఆరోగ్యానికి యోగ ఒక శక్తివంతమైన సాధనమని ఇండియన్‌ కోస్ట్‌ గార్డు రీజిన్‌ ఈస్ట్‌ డీఐజీ దినకరన్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ డిస్ట్రిక్ట్‌ 3232 సహకారంతో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, బోర్న టు విన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు వర్షా అశ్వణి నేతృత్వంలో గురువారం ఉదయం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఐజీ దినకరన్‌, గౌరవ అతిథిగా పాల్గొన్న స్పెస్‌ కిడ్స్‌ ఇండియా వ్యవస్థాపక సీఈఓ శ్రీమతి కేశన్‌ పాల్గొని, వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ దినకరన్‌ మాట్లాడుతూ శారీరక, మానసిక, ఆరోగ్యానికి యోగ ఎంతో దోహదపడుతుందని, ప్రతి రోజూ యోగాసనాలను కొన్నింటినైనా వేయాలని సూచించారు. నేటి ఆధునిక కాలం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మరిచిపోతున్నారన్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఒత్తిడి నుంచి బయటపడాలంటే యోగ ఎంతో దోహదపడుతుందని సూచించారు. అనంతరం యోగ గురువు మోనా బఫ్నా నేతృత్వంలో యోగాసనాలు వేశారు. ఇందులో అన్ని వయస్సుల వారు పాల్గొని, యోగాసనాలు వేసి, అవగాహన పెంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement